ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 20 :
మందమర్రి మున్సిపాలిటి పరిధిలో ప్రధాన కూడలిలో ఫ్లెక్సీలను పెట్టడం వలన వాహనాదారులకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాటిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సోమవారం టిఆర్ఎస్ శ్రేణులు మున్సిపల్ కమిషనర్ నిలిగొండ వెంకటేశ్వర్లు ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు జె.రవీందర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం ప్రకారం ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల మున్సిపాలిటీకి నిధులు రావడం జరుగుతుందన్నారు. ఇట్టి బోర్డుల ద్వారా మున్సిపాలిటీకి ఎంత మెరకు నిధులు జమ అయినవి అంతేకాకుండా చెరువునీ మినీ ట్యాంక్ బండ్ కోసం లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. కానీ ప్రజలకు ఆహ్లాదంగా ఉండకుండా ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలు వెలిసాయని వాటిపై కూడా చర్యలు తీసుకోగలరని వారు మున్సిపల్ కమిషనర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు యూత్ విద్యార్ధి సోషల్ నాయకులు పాల్గొన్నారు.