-తహాసిల్దార్ కు వినతి పత్రం అందించిన టిడిపి శ్రేణులు
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 20:
అంత్యోదయ కార్డులు అర్హులకే చెందాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం తహసిల్దార్ కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టిడిపి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొంతమంది డబ్బులు లంచమిచ్చి అనర్హులుగా ఉన్నప్పటికీ అంత్యోదయ కార్డులు అనుభవిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అంత్యోదయ కార్డులు చెందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంత్యోదయ కార్డుల విషయంలో తగు విచారణ జరిపి అర్హులకు ఇప్పించగలరని తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ విషయమై తహాసిల్దార్ సానుకూలంగా స్పందించారని ఎవరైతే అర్హులు ఉన్నారో దరఖాస్తు చేసుకోవాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ మహిళా అధ్యక్షురాలు జయ, సుకన్య, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, మహిళా ప్రధాన కార్యదర్శి జూపాక సంధ్య, పారుపల్లి శీను, చాట్లపల్లి రాజేష్, సత్యనారాయణ, రాజేష్, భాగ్యలక్ష్మి, కళావతి, అనూష, అహల్య తదితరులు పాల్గొన్నారు.