మణికొండలో బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహణ.

గండిపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 20 జనవరి 2025.
మణికొండ బాల్ బాడ్మింటన్ వారు గతంలో జరిగిన గట్టుప్పల్ లోనీ తెలంగాణ రాష్ట్ర బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్లో ద్వితీయ బహుమతి సాధించిన ఉత్సాహంతో ప్రస్తుతం మణికొండ బాల్ బాడ్మింటన్ తరపున మణికొండ అలకాపురిలో గల జయశంకర్ పార్క్ లో ఫిబ్రవరి 2 వ తేదీన ఉదయం నుండి రాత్రి వరకూ టౌర్నమెంట్ నిర్వహించడానికి తలపెట్టిన దరిమిలా స్థానిక కౌన్సిలర్, మణికొండ బాల్ బాడ్మింటన్ చీఫ్ పాట్రాన్ ఆలస్యం నవీన్ కుమార్ ఆద్వర్యంలో మణికొండ మునిసిపల్ కమిషనర్ ను కలవడం జరిగినది, ఈ సందర్భముగా ఆడడానికి ఎక్కువ జట్టులు పాల్గొన్న యెడల అవసర నిమిత్తం ఏం.జీ పార్కును కూడా వాడుకోవడానికి అనుమతించ వలసినదిగా కమిషనర్ ను కొరడ మైనది అందుకు గాను కమిషనర్ సానుకూలంగా స్పందించారని అందె లక్ష్మణ్ రావు తెలియ పరుస్తూ, కమిషనర్నూ కలసిన వారిలో మణికొండ బాల్ బాడ్మింటన్ ముఖ్య సలహాదారుడు అందె లక్ష్మణ్ రావు, అధ్యక్షుడు ఆనంద్ రావు, ఉపాధ్యక్షుడు బీ. హరినాద్ రెడ్డి తది తరులు కలరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking