గండిపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 20 జనవరి 2025 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అర్హులందరికీ వార్డు సభలు నిర్వహించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసీ రేషన్ కార్డులు జారీ చేయాలని సూచించిన సందర్భంగా మణికొండ పురపాలక సంఘ కమిషనర్ అందుకు భిన్నంగా మీడియా పరంగా కానీ ఇతరత్రా ప్రచార మాధ్యమాల ద్వారా కానీ విస్తృత ప్రచారం కల్పించకుండా నామ మాత్రంగా జనవరి 16 న సర్కులర్ జారీ చేయడం అందులో జనవరి 21, 22 తేదీలలో ఏ వార్డులో ఎప్పుడు ఎక్కడ వార్డు సభ నిర్వహిస్తున్నారో గుట్టు చప్పుడు కాకుండా వార్డు సభలు నిర్వహిస్తున్నట్టు అతి కొద్ది మందికి మాత్రమే తెలిపినారు, అంతే కానీ వార్డు సభ నిర్వహణ మరియు లబ్ధిదారుల ఎంపిక గురించి స్తబ్దుగా ఉండడంపై పలు అనుమానాలకు దారి తీస్తున్న సందర్భముగా పారదర్శకత లేని చర్యలను మరియు అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగే అవకాశం లేదనీ భావిస్తూ ఇట్టి చర్యలను బీ.ఆర్.ఎస్ పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కార్యనిర్వాహక అద్యక్షుడు కంబగళ్ల ధనరాజ్, మహిళా అధ్యక్షురాలు రూపా రెడ్డిలు పార్టీ తరపున ఖండిస్తూ ఇప్పటికైనా వార్డు సభల నిర్వహణ ఏ కారణంతో నిర్వహిస్తున్నారో పురపాలక సంఘం అధికారులు తక్షణమే స్పందించి సామాన్య ప్రజలకు వివరముగా తెలియ పరుస్తూ రేషన్ కార్డుల జారీ గురించి విస్తృత ప్రచారం కల్పించాలని కోరుతున్నామనీ లేని యెడల లోగుట్టు పెరుమాళ్లకు తెలుసుననే చందంగా ప్రజలకు సరియైన న్యాయం జరగడం లేదని అందు అవసరమైతే ప్రజల మద్దతుతో ఉద్యమిస్తామని హెచ్చరించినారు.