దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా చేసిన బిఆర్ఎస్ సర్కార్

– ప్రభుత్వ నిధులు పార్టీ ప్రచారానికి వినియోగిస్తారా?

సూటిగా ప్రశ్నించిన పొంగులేటి అనుచరుడు మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి జూన్ 23 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చించి పార్టీ ప్రచార కార్యక్రమాలను నిర్వహించిందని కామేపల్లి మాజీ జెడ్పిటిసి సభ్యులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆరోపించారు.శుక్రవారం
కామేపల్లి మండలం పండితాపురం లో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు.ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు దశాబ్ది దగా అని విమర్శించారు.ప్రభుత్వం వైఫల్యం చెందిన అంశాలు ఈ విధంగా ఉన్నాయి
కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య
ఫీజ్ రీయంబర్స్‌మెంట్ ఇంటికో ఉద్యోగం
నిరుద్యోగ భృతి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి పోడు భూములకు పట్టాలు
రైతు రుణ మాఫీ కెసిఆర్ పైశాచిక ఆనందం కోసమే బీసీ బందు కూడా సమగ్ర సర్వేలాంటిదే అన్నారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రజలను ఇబ్బందుల పాలుచేసి పైశాచికానందం పొందినట్లుగానే ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా దళిత బందు ఇచ్చినట్లుగానే బీసీ బందు ఇస్తానని మాయ మాటలు చెప్పి చివరికి లక్ష రూపాయలివ్వటానికి సవా లక్ష కండిషన్లు పెట్టి అర్థం పర్థం లేని సర్టిఫికెట్ల కోసం డెడ్ లైన్ పెట్టి ఆఫీసుల చుట్టూ రేయంబగుళ్ళు పడిగాపులు కాస్తు బీసీ లందరూ అష్ట కష్టాలు పడుతుంటే చూసి కేసిఆర్ సరదాగా పైశాచికానందం పొందటానికి అలవాటు పడ్డాడని మండిపడ్డారు. అయిననూ ఒక్కశాతం మందికి కూడా బీసీబందు ఇచ్చే పరిస్థితే లేదన్నారు గతంలో కూడా కుటుంబ సమగ్ర సర్వే అని ఒకే ఒక్క రోజులో ఎవరి ఇండ్లలో వారే ఉండి వివరాలు రాయించుకుంటే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇండ్ల జాగాలు భూములు లోన్లు ఇస్తామని కెసిఆర్ ప్రకటించగానే బ్రతుకుతెరువు కోసం దేశం నలుమూలలో ఉన్న తెలంగాణ ప్రజలందరూ ఒకేరోజు వ్యయ ప్రయాసలకోర్చి రైళ్లలో బస్సులలో అష్ట కష్టాలు పడుతూ సర్వేలో పాల్గొంటే ఒక్కరి కంటే ఒక్కరికి కూడా లబ్ధి జరగలేదని గతాన్ని గుర్తు చేస్తూ కేవలం కేసీఆర్ పైశాచిక ఆనందం కోసమే వందలకోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి కుటుంబ సమగ్ర సర్వే చేయించాడని అలాంటిదే ఈ బీసీ బందు అన్నారు. బీసీ కులాలతో పాటు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాల వారిని కూడా కెసిఆర్ పైశాచిక ఆనందం పొందటానికి చెప్పే బూటకపు మాటలను పచ్చిమోసాలను ప్రతిపక్ష పార్టీలు గానీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ ఖండించకపోవడం దురదృష్టకర మన్నారు.
ఈ సమావేశంలో మేకల మల్లికార్జునరావు,
బానోత్ నరసింహ నాయక్, శీలం, పుల్లయ్య, మేకపోతుల మహేష్, పాటిబండ్ల ప్రసాద్, భూక్య నాగేంద్రబాబు నాయక్ బి.నాగరాజు గుండ్ల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking