బెల్లంపల్లి చౌరస్తాలోపులే విగ్రహం కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 23 : తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో బెల్లంపల్లి చౌరస్తా లోని సర్కిల్లో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ప్రతిష్టించుటకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బెల్లంపల్లి చౌరస్తానందు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు నరేడ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి బెల్లంపల్లి చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ప్రతిష్టించాలని స్థలం కేటాయించాలని పలుమార్లు జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ ,మున్సిపల్ కమిషనర్ ,స్థానిక ఎమ్మెల్యే గార్లకు విన్నవించినప్పటికీ ఇప్పటివరకు ఈ విషయంలో ఎవరి వద్ద నుండి కూడా సరైన స్పందన రాకపోవడం దురదృష్టకరం.కాబట్టి ఈ విషయంలో సబండ వర్గాలను ఏకం చేస్తూ ఈరోజు బెల్లంపల్లి చౌరస్తాలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మంచేర్ల సదానందం ,పట్టణ అధ్యక్షులు వైద్య భాస్కర్ వర్కింగ్ అధ్యక్షుడు పోట్టాల మల్లేష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ కోశాధికారి సల్ల విజయ్ కుమార్ ఉపాధ్యక్షులు పెద్దపల్లి సూరన్న వియ్యాల సత్తయ్య పట్టణ కార్యదర్శులు వెన్నంపల్లి రవి సహాయ కార్యదర్శిలు గడ్డం సుధాకర్, ఎంబడి కిషన్, వైద్య రవి, కుడుక మోహన్, గుమ్ముల శీను, గుమ్ముల సుదర్శన్ లతోపాటుగా బీసీ సీనియర్ నాయకులు అందే శ్రీ తిరుపతి, కలవల సుధాకర్ రావు ఏదునూరి రమేష్, బింగి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు