శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్ రావు. వంటేర్ ప్రతాప్ రెడ్డి.
మెదక్ /తూప్రాన్, ఆగస్ట్ 14
ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా బిఆర్ఎస్ తూప్రాన్ మున్సిపల్ అధ్యక్షులు సతీష్ చారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
జన్మదిన సందర్బంగా సతీష్ చారి మంత్రి హరీష్ రావు నివాసం మరియు వంటెర్ ప్రతాప్ రెడ్డి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసారు.సతీష్ చారికి మంత్రి హరీష్ రావు, వంటేర్ ప్రతాప్ రెడ్డిలు శాలువా తో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ సతీష్ చారి ప్రజాసేవలో నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దామోదర్ రెడ్డి, మన్నే శ్రీనివాస్, వెంకట చారి నరేష్ రాజు శ్రీనివాస్ రెడ్డి ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.