కలెక్టర్ కార్యాలయం ముందు సింగూరు గ్రామ ప్రజలకు తక్షణ న్యాయం చేయాలని బీఎస్పీ పార్టీ ధర్నా

 

సంగారెడ్డి సెప్టెంబర్ 11 ప్రజ బలం ప్రతినిది:
సింగూరు ప్రాజెక్టు నిర్మాణంలో నష్టపోయిన సింగూరు గ్రామ ప్రజలకు నేటికీ పరిహారం అంద చేయకుండా, ఆ గ్రామ ప్రజలను ఆదుకోకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం కనీసం మానవత్వం కూడా ప్రధర్శించట్లేదని బహుజన్ సమాజ్ పార్టీ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ముప్పారం ప్రకాశం అన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) అందోల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సింగూరు భూ నిర్వాశితులతో కలిసి, ఆ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మెంచు నగేష్ కు డిమాండ్ తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ సింగూరు గ్రామంలో భూ నిర్వాసితులకు నేటికీ అనేక మందికి న్యాయం జరగకపోవడం సిగ్గుచేటు అన్నాడు.
సింగూరు గ్రామంలో కట్టిన 150 డబుల్ బెడ్ రూమ్ లు మొత్తము అనరులకే పంచారని, ఈ డబల్ బెడ్ రూమ్ ల కేటాయింపు పై సమగ్ర విచారణ జరిపించి, అర్హత కలిగినోళ్లకే పంచాలని, లేనిపక్షంలో అధికార పార్టీ అర్హులు అని చెప్పి అనారులకు ఇచ్చినటువంటి డబల్ బెడ్ ఇండ్లు ఎవరు నివాసం లేకుండా ఖాళీగా ఉంటే, స్వాధీనం చేసుకొని అర్హత కలిగినోళ్లకి తక్షణమే పంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ నైనా తక్షణమే సింగూరు ప్రజలకి పంచాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఎస్పి సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ పి మోహన్, అందుల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లె కుమార్ గౌడ్, సింగూరు గ్రామ కమిటీ అధ్యక్షులు అల్గోలు యాదయ్య, జంగంగారి కుమార్ విష్ణు, శంకర్, నాగమణి, లక్ష్మి, డప్పు అనిల్ కుమార్, శ్రీనివాస్, మల్లేష్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking