తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (Telangana state democratic forum.(TSDF). విధాన పత్రం విడుదల, ఉమ్మడి కార్యచరణ ప్రకటన

 

బిజెపి మతోన్మాద ఫాసిస్టు నియంతృత్వ విధానాలు, బడా సంపన్న అనుకూల విధానాలు, పేదల ప్రజల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా

కెసిఆర్ ప్రభుత్వ అడ్డు అదుపు లేని అవినీతి, ఆర్థిక దోపిడీ నియంతృత్వ, రాచరిక పాలనకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, లౌకిక ప్రజాస్వామిక సంస్థలు కలిసి ఐక్యంగా ఉమ్మడి కార్యచరణ కొరకు గత రెండు నెలలుగా అనేక దఫాలు సమావేశాలు జరిగాయి. తదనంతరం ఉమ్మడి విధానపత్రం, ఉమ్మడి కార్యచరణను రూపొందించుకున్నాయి.

ఇందులో CPI, CPI(ML) ప్రజాపంథా,, సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ, MCPI(U), CPI(ML) న్యూ డెమోక్రసీ, RSP, BLF, భారత జాతీయ ఉద్యమ సంఘం, తదితర అనేక లౌకిక ప్రజాసంఘాలు కలిసి విధాన పత్రాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉమ్మడి కార్యచరణ ను విస్తృతంగా చర్చించి రూపొందించడం జరిగింది.

తెలంగాణ ప్రజాస్వామిక వేదిక చైర్మన్ గా జస్టిస్ చంద్రకుమార్ , కో కన్వీనర్లుగా ప్రతి పార్టీకి ఒక్కొక్కరు చొప్పున ఉండాలని నిర్ణయించడం జరిగింది, రాష్ట్ర సమన్వయకర్త గా నైనాల గోవర్ధన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక విధాన పత్రాన్ని హాజరైన నాయకులు విడుదల చేయడం జరిగింది.

ఈ సభకు వినాయక్ రెడ్డి ( రిటైర్డ్ ప్రొఫెసర్ ) అధ్యక్షత వహించారు.

జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆదాని అంబానీ లాంటి కొద్దిమంది పెట్టుబడిదారులకు దోచిపెడుతున్న తీరును వివరించారు. వీరి ఆస్తులు అంతులేనంతగా, పెరిగితే పేద ప్రజల కనీస జీవన విధానం దుబ్బరమైందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలో ఒక ఆధునిక రాచరిక వ్యవస్థను నెలకొలిపి ప్రజల హక్కులను ఉక్కుపాదంతో అణిచివేసింది అని చెప్పారు.

జువ్వాడి చలపతిరావు(సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు) మాట్లాడుతూ, మత విభజన విద్వేషాలను దేశంలో రెచ్చగొడుతూ ప్రజల వాస్తవ జీవిత సమస్యల నుంచి పక్కదారి పట్టిస్తూ, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు దారా దుత్తం చేస్తుందన్నారు. ప్రజలు జీవించే హక్కులను రద్దు చేస్తుందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన కాలేశ్వరం భగీరథ ప్రాజెక్టులు అంతులేని అవినీతిగా మారాయి అన్నారు. వేలకోట్ల అవినీతి సొమ్మే ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు.

కే గోవర్ధన్ ( సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ, 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కెసిఆర్ పాతిపెట్టారన్నారు. ప్రజాసామిక హక్కులను ఉక్కు పాదంతో అణిచివేశారు అన్నారు .మోడీ ప్రభుత్వం మతం ఎజెండాతో తీవ్రస్తాయి మతతత్వ ఎజెండాను , మారణకాండను కొనసాగిస్తుందన్నారు. పేదరికం దుర్భర సమస్యలను నిర్మూలించకుండా భారత్ అనే పేరును రద్దు చేసింది అని చెప్పారు

బాల మల్లేష్ సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలని ధ్వంసం చేస్తుందన్నారు. మత సంస్కృతిక ఎజెండాతో అనేక రాష్ట్రాల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం బిజెపి, దానికి మతం పేరిట విద్వేషాలను, రంగును పులుముతుంది అన్నారు.

హన్మేష్ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కొల్లగొట్టి సన్నిహిత పెట్టుబడిదారులకు దోచిపెడుతుంది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల లక్షల కోట్ల డబ్బులను సామాన్య ప్రజల ప్రయోజనాలకు కాకుండా , గుజరాత్ పెట్టుబడిదారులకు దారపోస్తుందన్నారు.

జానకి రాములు ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక విధానపత్రం బిజెపి మోడీ కేసీఆర్ ప్రభుత్వం విధానాలు అషేశ ప్రజానీకానికి వ్యతిరేకమని స్పష్టంగా వెల్లడించింది. దృఢంగా మా కార్యచరణ కొనసాగుతుందన్నారు.

తుకారాం ఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాట్లాడుతూ రైతులు కార్మికులు కర్షకులు అన్ని వర్గాలపై కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వాలు ఇద్దరు కుమ్మక్కై పీడిస్తున్నారు అన్నారు. పైకి శత్రువులుగా నటిస్తున్న బిజెపి చంద్రశేఖర రావు మంచి మిత్రులను పేర్కొన్నారు.

గుర్రం విజయ్ కుమార్ సిపిఎంఎల్ కేంద్ర నాయకులు కూడా పాల్గొన్నారు.

కృష్ణ ప్రసాద్ భారత్ జాతీయ ఉద్యమం నాయకులు బిజెపి అంతర్గత ఎజెండా రాజ్యాంగాన్ని రద్దు చేయడం అన్నారు . హిందూమత ఫాసిసంను ముందుకు తీసుకురావడం వారి ఉద్దేశం అన్నారు. కెసిఆర్ మోడీలను ఓడించకపోతే దేశం ప్రమాదకర స్థితిలో పడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మన్నారం నాగరాజు తెలంగాణ లోక్సత్తా అధ్యక్షులు, ఎం శ్రీనివాస్ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కార్యదర్శి, అనురాధ పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు, మండల వెంకన్న ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి, సోగరా బేగం, అబ్దుల్ హుక్ కమీర్, ఇస్లాముద్దీన్, లక్ష్మీనారాయణ, కామేశ్వరరావు లు పాల్గొన్నారు.

బిజెపి మోడీ కేసీఆర్ ప్రభుత్వాల నియంతృత్వ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఒక భారీ రాష్ట్రస్థాయి సదస్సును జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్యమ కార్యచరణను జిల్లా మండల గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking