ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం
జగిత్యాల ప్రతినిధి, మే 6:(ప్రజాబలం) ఎస్సి వర్గీకరణపై బిఎస్పీ పార్టీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఎంఎస్పీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం డిమాండ్ చేశారు. శనివారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో విడుదల చేసిన ప్రకటనలో
మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీను జగన్ ఆధ్వర్యంలో జగిత్యాలలో బిఎస్పీ వైఖరిని కోరామన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్పి జిల్లా కన్వీనర్ దుమాల గంగారాం మాట్లాడుతూ ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఉండాలనేది కాన్షీరాం సిద్ధాంతమని ఆ సిద్ధాంతానికి బహుజన సమాజ్ పార్టీ కట్టుబడి ఉంటే కాన్షీరాం మీద గౌరవం ఉంటే మాయావతి తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు తెలపాలని అన్నారు. ఎస్సీలలో అత్యల్ప జనాభా కలిగిన ఒక్క కులానికే అత్యధిక రిజర్వేషన్లు లభిస్తున్నాయని, అత్యదిక జనాభా కలిగిన మాదిగ, ఉప కులాలకు తగినంత రిజర్వేషన్లు రాకపోవడం వల్ల నష్టపోతున్నారని అన్నారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించి అన్ని కులాలను న్యాయం చేయాలని మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ఉద్యమం జరుగుతుందని అన్నారు. అయితే ఈ ఉద్యమాన్ని సమగ్రంగా అర్థం చేసుకోకుండా గతంలో హైదరాబాద్ కు వచ్చిన మాయావతి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ప్రకటన చేసిందని అన్నారు. ఆ ప్రకటన లక్షలాది మంది మాదిగ బిడ్డలను నిరాశకు గురి చేసిందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ వస్తున్న మాయావతి ఎస్సీ వర్గీకరణ మీద సానుకూల ప్రకటన చేసి సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను చాటుకోవాలని గంగారాం డిమాండ్ చేశారు. మాయావతి ప్రకటన కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని మాదిగ, ఉప కులాల ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తే బిఎస్పీని మాదిగ, ఉప కులాల ప్రజలంతా వ్యతిరేకిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా కో కన్వీనర్ బెజ్జకి సతీష్, నియోజీకవర్గ ఇంఛార్జి బోనగిరి కిషన్, పట్టణ ధర్మపురి ఎంఎస్పి నియోజకవర్గ ఇన్చార్జి అరికిళ్ల సతీష్, ఇంఛార్జి బొల్లారాపు దివాకర్, ఎమ్మార్పీఎస్ పట్టణ ఇన్చార్జి బుగ్గారం మండల ఇంఛార్జి చిర్ర లక్ష్మణ్, రూరల్ మండల ఇంఛార్జి బిరుదులు శ్రీను, ఎంఎస్పి ఇంఛార్జి బిరుదుల గంగారాం, మెట్ పల్లి డివిజన్ ఇంఛార్జి మోతే సుధాకర్, దుమాల రాజు, బొమ్మెన రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు