మరోచోట ఫ్యాక్స్ గోదాం నిర్మించండి

కలెక్టర్ ను కోరిన జాభితాపూర్ గ్రామస్తులు

జగిత్యాల, జులై 31: జాభితాపూర్ గ్రామములో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న గోదాంను మరోచోట నిర్మించాలని జాభితాపూర్ గ్రామస్తులు కలెక్టర్ ను ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులో కోరారు. సోమవారం ఉదయం గ్రామస్తులు ప్రజావాణికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. జాభితాపూర్ గ్రామంలో 2007 లో సర్వే నెం. 479 లో 5 ఎకరాల స్థలాన్ని ఐకెపి కి కేటాయించారన్నారు. ప్రభుత్వం ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్మించే గోదాం ను ఇదే స్థలంలో నిర్మిస్తున్నారన్నారు. ఇదే 479 సర్వే నెం.లో దాదాపు 150 ఎకరాల స్థలం ఉందని ఫ్యాక్స్ గోదాం ను మరోచోట నిర్మిస్తే గ్రామస్తులకు, రైతులకు రెండు ప్రయోజనాలు ఉంటాయని ఆదిశగా నిర్ణయం తీసుకోవాలని ఉప సర్పంచ్ కుంట లక్ష్మారెడ్డి, మారిశెట్టి లక్ష్మణ్, హేమలత, మారిశెట్టి సతీష్, గంగాధర్ తోపాటు పలువురు కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking