మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి జూలై 31:
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే దరఖాస్తలపై సంబంధిత శాఖల అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి అన్నారు. సోమవారం శామీర్పేట జిల్లా సమీకృత అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వచ్చిన63 దరఖాస్తులను అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి స్వీకరించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా పరిష్కరించుకోవడానికి వస్తున్న ప్రతిఒక్కరి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుల ద్వారా వారి సమస్యను గురించి తెలుసుకుంటు, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.