ప్రయాణికులకు షెడ్డును నిర్మించడం హర్షనీయం

 

అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ఉత్కూర్ లోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడంతో అధికారులు స్పందించి ప్రయాణికుల కోసం తాత్కాలిక షెడ్డు నిర్మించడం చాలా హర్షనీయమని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు పేర్కొన్నారు.గురువారం అయన స్థానిక నాయకులతో కలిసి నూతనంగా నిర్మించిన తాత్కాలిక షెడ్డును పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు. రాజు మాట్లాడుతూ…24 గంటల్లో స్పందించిన మున్సిపల్,ఆర్టీసీ, పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బైరం లింగన్న,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్,గరిసే రవీందర్, శ్రీనివాస్,ప్రయాణికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking