తూప్రాన్ నలందా జూనియర్ కళాశాల విద్యార్థినిల ప్రభంజనం

 

తూప్రాన్, ఎప్రిల్, 25 ప్రజాబలం న్యూస్ :-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఇంటర్మీడియెట్ ఫలితాలలో తూప్రాన్ నలంద జూనియర్ కళాశాల విద్యార్థినుల ప్రభంజనం సృష్టించారని కరస్పాండెంట్ పి.వెంకట రమణ హర్షం వ్యక్తం చేశారు. తూప్రాన్ పట్టణంలో 2023-24 విద్యా సంవత్సరంలో కేవలం బాలికలకు మాత్రమే తరగతులను నిర్వహించి, అతి తక్కువ అడ్మిషన్ల నుండి అత్యధిక ఫలితాలను సాదించి విజయ దుందుభి మోగించిన ఏకైక కళాశాల మీ ,మా,మన నలంద జూనియర్ కళాశాల అని తెలిపారు. 2023-2024 సంవత్సరంలో కేవలం 74 మంది బాలికలను అడ్మిషన్లు తీసుకోని నేటి ఫలితాల్లో 51.65 శాతం పాస్ పర్సంటేజ్ సాధించిన ఏకైక కళాశాల నలంద కళాశాల అని అన్నారు. 2024 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో మెరుగైన ఫలితాలను సాధించిన మా విద్యాకుసుమాలు..
ఎం.పి.సి లో ఏ.స్రవంతి 470 మార్కులకు గాను 418 మార్కులు సాధించి ర్యాంక్ పొంది కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిందన్నారు. అలాగే జి. శృతి 470 మార్కులకు గాను 410 మార్కులు సాధించి ర్యాంక్ తెచ్చారని అన్నారు. వి.కల్పన 440/416, సి.హెచ్.దీపిక 378/440, సి.ఈ.సి లో అర్.వైష్ణవి 425/500, ఎస్.శ్రావణి 422/500, పి.పూజిత 420/500, బి.రేవతి 403/500. ఇలా ఇంకా ఎన్నెన్నో
తూప్రాన్ పట్టణ, పరిసర ప్రాంత విధ్యార్థుల మరియు వారి తల్లి తండ్రుల కోరిక మేరకు 2024-25 సంవత్సరం నుండి బాలికలకు మరియు బాలురకు ప్రత్యేకంగా తరగతులను నిర్వహించడం జరుగుతుందనీ 2024-25 కి అడ్మిషన్ లు ప్రారంభమైందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking