విశ్వ కర్మల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కృషి

బండి సంజయ్ కి మద్దతు తెలిపిన విశ్వబ్రాహ్మణుల సంఘం నేతలు

కరీంనగర్ ప్రతినిధి ప్రజాబలం మే5 :

జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కు కరీంనగర్ జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సంఘం నేతలు విశ్వకర్మ యోజన కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ రంగు భాస్కరాచారి, విశ్వబ్రాహ్మణుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పాములపర్తి వేణుగోపాల చారి,విశ్వకర్మ కౌశల్ యోజన జిల్లా కన్వీనర్ రాజ బ్రహ్మచారి , ఇతర నేతలు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దశాబ్దాలుగా విశ్వకర్మ లను అనేక రాజకీయ పార్టీలు వారి స్వార్థంకోసమేవినియోగించుకున్నారని , ఆర్థికంగా రాజకీయంగా విశ్వకర్మల అభివృద్ధికి ఏ రాజకీయ పార్టీ కృషి చేయలేదన్నారు. కానీ కేంద్రంలోని బిజెపి మోదీ ప్రభుత్వం విశ్వకర్మల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు.చేతి వృత్తుల వారికి ఆర్థిక చేయూత అందించే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. బృహత్ ప్రణాళికతో నిరుపేద విశ్వ కర్మ ల కోసం మోదీ ప్రభుత్వం విశ్వకర్మ యోజనపథకాన్నితీసుకొచ్చిందన్నారు.విశ్వకర్మ యోజన పథకం కింద ఎంపిక కాబడిన వారికి ట్రైనింగ్ తో పాటు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వంఅందించిచేయూతనిస్తుందన్నారు. విశ్వకర్మలకు లేబర్ కార్డుతో పాటు అంత్యోదయ కార్డు కూడా ప్రభుత్వం అందిస్తుందన్నారు. గతంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్ ప్రభుత్వాలు విశ్వబ్రాహ్మణ గుర్తించిన దాఖలాలు లేవనీ,
విశ్వబ్రాహ్మణుల గురించి ఆలోచించేది బిజెపి పార్టీ మాత్రమేన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం విశ్వకర్మలకు పెద్దపీట వేసి విశ్వకర్మ సమ్మాన్ నిధి కింద 13 వేల కోట్ల రూపాయలను కేటాయించడం గొప్ప విషయమన్నారు. విశ్వబ్రాహ్మణుడైన శ్రీకాంత్ చారి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేశారనీ, పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో విశ్వబ్రాహ్మణులకు కనీస గుర్తింపు లేదన్నారు. లోగడ జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రమే విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించిందనీ, విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ప్రోత్సహించేది బిజెపి పార్టీ మాత్రమేన్నారు.. కేంద్రంలోని బిజెపి మోదీ ప్రభుత్వం ప్రధాని మోదీ విశ్వకర్మ ను గుర్తించి 18 రకాల చేతివృత్తుల వారికి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రకటించిందన్నారు. మోదీ ప్రభుత్వం విశ్వకర్మ కౌశల్ యోజన పథకంతో అర్హులను గుర్తించి లబ్ధి పొందేలా కృషి చేస్తోందన్నారు. విశ్వకర్మలకు పూర్తి న్యాయం జరగాలంటే కరీంనగర్లో బండి సంజయ్ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు పాముల పర్తి పర్తి వేణుగోపాల చారి , జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదారం శ్రీనివాస్, విశ్వకర్మ యోజన కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ రంగు భాస్కరాచారి, బీజేపీ ఓబీసి వైస్ ప్రెసిడెంట్ ,మియాపురం లక్ష్మణ చారి, విశ్వకర్మ కౌశల్ యోజన జిల్లా కన్వీనర్ మంచిర్యాల రాజ బ్రహ్మచారి ,జిల్లా ఉపాధ్యక్షుడు శానా గుండా నరేష్, శ్రీరామోజు రామూర్తి ,రుద్రో జు లక్ష్మణాచారి గారు, గర్రెపల్లి శ్రీనివాస్ ,గొల్లపల్లి సదాచారి నందగిరి బలరాం,ఉదారo కనక చారి, అన్నాజి సదానందం, శ్రీమంతుల శ్రీనివాస్ ,పాముల పార్థి దయ సాగర్ ,గుగ్గిళ్లు చంద్రమోలీ ,శానా కొండా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking