సిరిసిల్ల నేతన్నల గోసలు ముఖ్యమంత్రికి కనపడటం లేదు.

 

*నేత కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది .

*ఆరుగ్యారంటీ లను అమలు చేయడం లో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్…

మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకులు వాసాల రమేష్…

కరీంనగర్ ప్రతినిధి ప్రజాబలం మే 4

సిరిసిల్లకు వచ్చిన ముఖ్యమంత్రి కి నేతన్నల గోసలు కనిపించలేదా..? కనీసం ఆత్మహత్య నేతన్న కుటుంబాన్ని పరామర్శించలేని పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, ఆయనకు రాజకీయాల మీద ఓట్ల మీద ఉన్న శ్రద్ధ , సమస్యల పరిష్కారం పై లేదని, 6 గ్యారంటీల అమలుపై లేదని బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ వాసాల రమేష్ విమర్శించారు. కరీంనగర్ లోని పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశంలో వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు సిరిసిల్ల అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా సిరిసిల్ల పట్టణానికి వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి చేనేత కార్మికుల కష్టాలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు.
సిరిసిల్లలో దాదాపు 30 వేల పైగా కార్మికులు ఉన్నారనీ, పాత బకాయిలు చెల్లించకపోవడం తో నేత కార్మికుల పరిస్థితి గోరంగా మారిందన్నారు. వస్త్ర పరిశ్రమ మూతపడటంతో చేనేత కార్మికులు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేనేత పరిశ్రమకు దాదాపు 300 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలనీ, చేనేత బకాయిల చెల్లింపు పై ఎంపి బండి సంజయ్ దీక్ష చేపడతారని తెలిసి హడావిడిగా 50 కోట్ల రూపాయలు విడుదల చేశారనీ, ప్రభుత్వం విడుదల చేసిన 50 కోట్ల రూపాయలు, బతుకమ్మ చీరల వ్యాపారులకు 25 కోట్ల..మిగతా 25 కోట్లు అనుబంధ ప్రాసేసింగ్ వారికి చెల్లించారన్నారు. మిగిలిన బకాయిలను ఎన్నికల కోడ్ సాకుగా చూపకుండా ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. ముఖ్యంగా 20 వేల మంది
చేనేత పరిశ్రమపై ఉపాధి పొందుతున్నారనీ,ఆచరణలో లేని వాగ్దానాలు చేసి నిలుపుకోకుండ కాంగ్రెస్ ప్రభుత్వంవ్యవహరిస్తోందన్నారు. చేనేత కార్మికులకు ఎలాంటి భరోసా కల్పించకుండా సీఎం రేవంత్ పర్యటన ముగించారని, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదన్నారు. చేనేత సమస్యలపై డిసెంబర్ 18 వ తేదీన జేఎసి తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ వినతి పత్రం అందజేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు.మార్కెటింగ్ రంగంలో పోటీ తత్వం పెరిగిపోయిందన్నారు.ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.సర్వేలు అన్ని బీజేపీ కి అనుకూలంగా ఉన్నాయని తెలిసి, కారు ఢిల్లీకి పోయి పువ్వ్వు అవుతుందని కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేశారనీ, ఒకవైపు బిఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ లోకి చేర్చుకొని, మరోవైపు కారు కమలంగా మారుతుందని అనడం హాస్యాస్పదమన్నారు. జూన్ 4 వ తేది నాటి ఫలితాలతో కాంగ్రెస్ కి దిమ్మా తిరిగిపోవడం ఖాయమన్నారు. కాలేశ్వరం, ఫోన్ టాపింగ్ వ్యవహారాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేసినట్లు కనబడుతుందని, కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఉన్న బంధాలతోనే సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.ఫోన్ ట్యాపింగ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.స్థానిక కాంగ్రెస్ అభ్యర్ధి ఓటమి భయంతో ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేసు నమోదు అయ్యిందనీ తెలిపారు.పార్లమెంట్ ఎన్నికలలో బండి సంజయ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి, సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking