జాతీయ డెంగ్యూ దినోత్సవం

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే16:
.టి.రఘునాథస్వామి,
జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా
తో పాటు డాక్టర్ నారాయణరావు
, & డాక్టర్ గీతా ప్రసాద్, డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్స్ , కీసర మరియు మల్కాజిగిరి డివిజన్ డాక్టర్ సంధ్యా రాణి,
ప్రోగ్రామ్ ఆఫీసర్, NCVBDC(జాతీయ కేంద్ర కీటక జనిత వ్యాధుల నియంత్రణ)
డాక్టర్ పద్మావతి, ప్రోగ్రామ్ ఆఫీసర్, మినీ హబ్స్
మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నిర్వహించిన జాతీయ డెంగ్యూ దినోత్సవంలో 2024 లో పాల్గొని ర్యాలీలో పాల్గొని అనంతరం సమావేశంలో ప్రసంగించారు.

డాక్టర్ యీల్ కపూర్,
డాక్టర్ రాజమల్లు వైద్యాధికారులు పిహెచ్‌సి మల్కాజిగిరి,
లింగాల అక్షయ్ కుమార్ ,
సెక్షన్ ఇంచార్జ్
(జాతీయ కేంద్ర కీటక జనిత వ్యాధుల నియంత్రణ)
శ్రీ సత్యం, ఎఎంఓ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రసంగిస్తూ..
డాక్టర్ టి రఘునాథస్వామి.., డెంగ్యూ వ్యాధి , డెంగ్యూ వైరస్ వల్ల వస్తుంది మరియు ఏడెస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది,
డెంగ్యూ లక్షణాలు తేలికపాటి జ్వరం నుండి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ మరియు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన వ్యక్తీకరణల వరకు ఉంటాయి, తక్షణమే మరియు ప్రభావవంతంగా చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. ఇళ్లు మరియు పరిసరాలలో దోమల వృద్ధి ప్రదేశాలను తగ్గించడం ద్వారా, దోమల జనాభాను గణనీయంగా తగ్గించవచ్చు మరియు తద్వారా డెంగ్యూ వ్యాప్తి నివారించవచ్చు.

నిలువ ఉన్న నీటిని తొలగించడం, దోమల వికర్షకాలను ఉపయోగించడం మరియు కిటికీలు మరియు తలుపులపై స్క్రీన్‌లను అమర్చడం వంటి సాధారణ చర్యలు గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగిస్తాయి , ప్రజలకు అవగాహన అందించటం చాలా కీలకం అని తెలిపారు. ప్రతిఒక్కరు ఫ్రైడే డ్రైడే గా పాటించాలని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking