ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనారు ఆదేశాలమేరకు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఈ రోజు నిర్మల్ డిపో లో మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటుచేసారు.
డిపో లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రతి ఉద్యోగికి ఈ. సి.జి.-బి.పి-షుగర్-కొలస్టాల్,కిడ్ని,మొదలగు అన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు.
ఈరోజు సుమారు 72 మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వగించారు.ఈ హెల్త్ చెకప్ శిబిరం డిపో లోని ఉద్యోగులు అందరు అయిపోయే వరకు ఉంటుంది.
ముఖ్య అతితీగా ప్రముఖ దేవిబాయి క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైనకాలిస్ట్ డా.చంద్రిక,డా.విద్యాసాగర్ రావు హాజరయ్యారు.హెల్త్ చెకప్ చేయించు కుంటున్న ఉద్యోగులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
కార్యక్రమములో డిపామేనేజర్ ప్రతిమరెడ్డి,అసిస్టెంట్ మేనేజర్లు ఐ.రాజశేఖర్,నవీన్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Next Post