బదిలీపై వచ్చిన మేనేజర్ రామస్వామిని అభినందించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

 

 

ఖమ్మం ప్రతినిధి మే 17 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి కేంద్ర సహకార బ్యాంక్ నుండి కామేపల్లి మండలం తాళ్లగూడెం బ్రాంచ్ కు బదిలీపై వచ్చిన మేనేజర్ రామస్వామి ని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ శుక్రవారం శాలువా కప్పి సత్కరించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ కార్యదర్శి నుండి బ్యాంక్ అధికారిగా ప్రమోషన్ పొంది అనేక బ్రాంచ్ లలో వివిధ పదవుల ద్వారా బ్యాంకు అభివృద్ధికి సేవలందిస్తూ తను కూడా మేనేజర్ స్థాయికి ఎదిగాడని అన్నారు. రామస్వామి ఈ బ్రాంచ్ లో కూడా రైతులకు, ప్రజలకు, వ్యాపారులకు బ్యాంక్ అందించే వివిధ రకాల రుణాలను ప్రజలకు అందిస్తూ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని కాంక్షించారు.అలాగే తను కూడా యూనియన్ లీడర్గా పనిచేస్తూ ఉద్యోగస్తుల కు సేవ చేస్తున్నారని అతను ఉద్యోగంతో పాటు సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి మంచి వ్యక్తి అని ఆయన సేవలు మనకు మన బ్యాంకుకు ఎంతో అవసరమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేనేజర్ ఎం.రామస్వామి సూపర్వైజర్ ఎండి ఆసిఫ్ అలీ అసిస్టెంట్ మేనేజర్ కె.రామారావు క్యాషియర్ తస్లీమ్ మెసెంజర్ నరసయ్య శీలంపుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking