డెంగ్యూ నివారణ మా బిధ్యత సురక్షతమైన రేపటి కోసం

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 16 : జిల్లాలో డెంగ్యూ వ్యాధి చెందకుండా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, డెంగ్యూ నివారణ మా బాధ్యత సురక్షితమైన రేపటి కోసం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.గురువారం జిల్లాలోని హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ డెంగు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత,జిల్లా సర్వేయలెన్న్ అధికారి డాక్టర్ ఫయాజ్ లలో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రానున్న వర్షికాలంలో కీటక జనిత వ్యాధులు, దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను నియంత్రించడం ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందని, డెంగ్యూ లాంటి నివారించేందుకు ప్రజలందరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలని తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తగిన చికిత్స చేయించుకోవాలని తెలిపారు.డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివాస ప్రాంతాలలో నీరు నీలో ఉండకుండా చూసుకోవాలని మురుగు కాలువలు నీరు నిల్వ ఉన్నట్లయితే బల్స్ చల్లని, ఇంటి పరిసరాల్లో ఎక్కడ చెత్త లేకుండా శుభ్రంపరచుకోవాలని, ప్రతి మంగళ,శుక్రవారం డ్రైడే పాటించి దోమలను లార్వా దశలోనే నిర్మూలించేలా ప్రజలు సహకరించాలని తెలిపారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించడం జరుగుతుందని,వసతి గృహాలు, పాఠశాల లో శుభ్రతపై వివరించడమే కాకుండా పాటించేలా పరీక్షించాలని తెలిపారు. వ్యాధి నిర్ధారణ కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల లో ఏర్పాటుచేసిన కిట్ ల ద్వారా ప్రాథమికంగా నిర్ధారించడం జరుగుతుందని,జిల్లా ఆస్పత్రి టి హబ్ లో నిద్దరణ కొరకు పరీక్షలు చేయించుకోవాలని,ఎలాంటి భయంతోనకు గురికావాల్సిన అవసరం లేదని,డెంగ్యూ నివారణ దిశగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నివారణ ప్రాంతాలను పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు లహరి,ప్రశాంతి, ఎస్.యు.ఓ.లు నామ్ దేవ్ సత్యనారాయణ, రవీందర్, హెచ్ ఈ అల్లాడి శ్రీనివాస్,మాస్ మీడియా అధికారి బుక్య వెంకటేశ్వర్లు, సమంత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking