తూప్రాన్ లో బిఆర్ఎస్ మీడియా సమావేశం. హాజరైన ప్రజాప్రతినిధులు.

 

తూప్రాన్, మే 4 (ప్రజాబలం న్యూస్)

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపల్ కేంద్రం బస్టాండు ఆవరణలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు రాధాకృష్ణ మాజీ ఎఫ్ డీ సి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి నాయకులురాధాకృష్ణ శర్మ శేఖర్ గౌడ్ , ఆధ్వర్యంలో మీడియా సమావేశమును నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి ప్రజలకు సన్నిహితంగా సంక్షేమ పథకాలను అమలుపరిచిందని నేడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ గ్రామాలలో ప్రచారానికి వెళితే ఈసారి కారు గుర్తుకు ఓటు వేస్తామని కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతామని ప్రజల చేత వస్తున్న స్పందనను మీడియా సమావేశంలో పేర్కొంటూ మంగళవారం రోజున భారీ ఎత్తుగా రోడ్ షోలో మాజి మంత్రి హరీష్ రావు సమక్షంలో మూడు మండలాల ప్రజానీకం తో నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్, సత్యనారాయణ గౌడ్,బబుల్ రెడ్డి, పురం రవి,సతీస్ చారి, మహేశ్ , నాగభూషణం, చక్రవర్తి,రమేష్ ,విశ్వం
,షబ్బీర్,సత్తార్ ఆంజనేయులు ,
ఇస్లాంపూర్ సంతోష్ రేడ్డి, దాబా కాశిరెడ్డి, సత్య లింగం,జంగం రాములు, గజ్జల కృష్ణ, నర్సింలు, ప్రబాకర్ రేడ్డి ,వెంకటేష్ ,సిందే చంద్రం, రాజు, యాసిన్, శ్రీకాంత్ , ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking