పోలింగ్ కోసం ఈవీఎంల సిద్ధం చేయాలి

 

మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 4:
ఈ నెల 13 న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కోసం ఈ వి యం ల కమిషనింగ్ పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ అన్నారు .
శనివారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని లయోలా అకాడమీ జూనియర్ కాలేజి లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి కమిషనింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.అదేవిధంగా కూకట్ పల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జే న్ టీ యు లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కొనసాగుతున్న కమిషనింగ్ ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. బ్యాలెట్ పేపర్ ,బ్యాలెట్ యూనిట్లు, లో అభ్యర్థులకు కేటాయించబడిన ఎన్నికల గుర్తులను అమరుస్తున్న తీరును పరిశీలించారు. పోలింగ్ కోసం ఈవీఎంలను అన్ని విధాలుగా సిద్ధం చేయాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా కమిషనింగ్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు కమిషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈవీఎంలలో అమర్చే పవర్ ప్యాక్స్, రోల్స్ సరిపడా ఉన్నాయా అని ఆరా తీసిన రిటర్నింగ్ అధికారి గౌతమ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సైదులు, కూకట్ పల్లి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అభిలాష్ అభినవ్, ఎం ఆర్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking