పోస్టల్ బ్యాలెట్ సెంటర్ పరిశీలన జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అభిలాష్ అభినవ్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మే 4:
కూకట్ పల్లి లోని జే న్ టీ యు ఆడిటోరియం లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్ ను మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్, జోనల్ కమిషనర్,అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అభిలాష్ అభినవ్ తో కలసి కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన రిజిస్టర్లను పరిశీలించి, ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన ఎంతమంది ఓటు హక్కును వినియోగించుకున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి మురళి, ఎం ఆర్ ఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking