తెజస అధినేత కోదండరాంని కలిసిన డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. తెలంగాణ జన సమితి అధినేత, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం ను
డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏఎన్ రెడ్డి కాలనీ లో ప్రొఫెసర్ కోదండరాంను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. రాష్ట్ర రాజకీయాలు, జరగబోయే పార్లమెంట్ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ ప్రజలకు ఉద్యమానాయకుడుగారాష్ట్ర జెఎసి అధ్యక్షుడిగా సుపరిచితుడని అన్నారు.తెలంగాణా రాష్ట్ర సాధన కొరకు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారని సబ్బండ వర్గాలను ఒక్క తాటిపైకి తెచ్చి తెలంగాణ సాధనలో కీలక బూమి పోషించారని అన్నారు. ఇందులో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎర్రవోతూ రాజేందర్,తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షులు కొట్టే శేఖర్ ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking