బిఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మ దగ్ధం.

బీఆర్ఎస్ పార్టీ కాలేశ్వరం పర్యటన ఎలా ఉందంటే, చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది.

అన్నం ప్రవీణ్ తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 01

తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలో గల స్థానిక బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి రమేష్, అన్నం ప్రవీణ్, సజ్జు, మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మూడు సంవత్సరాల లోపే ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం అనేది దేనికి సంకేతమో బిఆర్ఎస్ పార్టీ చెప్పాలి అని దాదాపు లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లేకుండా నిర్మించి, అది కూలిపోవడానికి కారణమైన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు మేడిగడ్డలో ముక్కునేలకు రాసి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బిఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో అనాలోచిత నిర్ణయాలతో అత్యధిక అప్పులు చేసి, కేసీఆర్ తన ఇష్ట రాజ్యంగా తెలంగాణ ప్రాంతానికి ఒక రాజుగా బాధ్యత రహితంగా వ్యవహరించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిదని అన్నం ప్రవీణ్ విమర్శించారు. కాలేశ్వరం కూలిపోవడానికి కారణమైన బిఆర్ఎస్ పార్టీ ఏ పూర్తి బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రజానీకాన్ని 10 సంవత్సరాలు మోసం చేసి వంచించింది కాకుండా మల్లి ఒకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. బిఆర్ఎస్ పార్టీ – బిఆర్ఎస్ నాయకత్వం అని అన్నం ప్రవీణ్ విమర్శించారు.
ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ తో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, తెలంగాణ ప్రజలు నమ్మి కేసీఆర్ కి అవకాశం ఇస్తే నీళ్లలో కుంభకోణం,నిధులలో కుంభకోణం,నియామకాలలో కుంభకోణం చేసి తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని తన మాటల గారడితో వంచించిన తీరును అన్నం.ప్రవీణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న ప్రజా ప్రభుత్వానికి సహకరించి సలహాలు సూచనలు ఉంటే చేయాలి తప్ప, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా కాకతీయ యూనివర్సిటీ న్యాయ విద్యార్థులుగా ఊరుకోమని బిఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని ఎక్కడి కక్కడ బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేపడతామని అన్నం ప్రవీణ్ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ పార్టీలను అసెంబ్లీ సాక్షిగా కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పరిశీలించడానికి రావాలని కోరినప్పుడు బిఆర్ఎస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేసి నేడు కాలేశ్వరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకోవడం సిగ్గుచేటు అని, కేసీఆర్ కాలేశ్వరాన్ని బొందల గడ్డగా అభివర్ణించారు. మరి ఆ బొందల గడ్డకు కేటీఆర్ ఎందుకు వెళ్తున్నాడు చెప్పాల్సిన బాధ్యత కేసిఆర్ మీద ఉంది కాలేశ్వరం ప్రాజెక్టును చూపి దాదాపు లక్ష కోట్లు నిధులను దుర్వినియోగం చేసి కాలేశ్వరాన్ని బొందల గడ్డగా మాట్లాడిన కేసీఆర్ మాటలు మరి ఇప్పుడు కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పడానికి సందర్శిస్తున్నాడని సుంకర రమేష్ ప్రశ్నించారు.


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకరి రమేష్, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు సజ్జు, విద్యార్థి యువ నాయకులు బిజిగిరి శ్రీకాంత్, కారింగుల రాజేందర్, బుడిగె శ్రీకాంత్, ఏబూసి అజయ్, జియా, దిలీప్, భాను, కార్తీక్, అరుణ్, సలీం, నవీన్, దినేష్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking