ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి: జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల

 

దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసి, పలు రికార్డులు మరియు పరిసరాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల్ పోలీస్ స్టేషన్ ను నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి,జానకి షర్మిల. ఆకస్మి కంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని అన్నారు. అనంతరం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో సిసి కెమెరాల ఏర్పాటుపై గ్రామస్తులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఆర్థిక, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం రిసెప్షన్, మెన్ బ్యారక్, టెక్నికల్ రూంలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పోలీస్ సిబ్బంది యొక్క విధులు మరియు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దిలావర్పూర్ ఎస్సై సుమాంజలి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking