తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎండి హకీమ్
ఖమ్మం ప్రతినిధి మార్చి 1 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి చెందిన లెటర్ హెడ్ ను వారి ఇష్టారాజ్యంగా జిల్లా అధ్యక్షుల పేరును మార్చి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బోయినపల్లి రామారావు ను సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ మంజిద్ సింగ్ ఆదేశాలతో ఇటీవల తొలగించటం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు యం.డి. హకీం అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సంఘం భవనంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపక్రమించడంతో బోయినపల్లి రామారావును జనవరి 8వ తేదీన, తమ సంఘ లెటర్ హెడ్ ను వారికి అనుకూలంగా మార్చుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడైన నా పేరు లేకుండా వారి ఇంఛార్జ్ అధ్యక్షుల పేరును ఏర్పాటు చేసుకుని సంఘ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ఈ నేపధ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయమునకు వెళ్ళి సంఘం పేరుతో పైరవీలకు ఒడిగట్టడంతో రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు తాను సంజాయిషీ నోటీస్ ను పంపించగా సదరు రామారావు ఆ నోటీస్ ను తీసుకోక పోవటంతో మేము పంపిన నోటీస్ తిరిగి వెనక్కి రావటంతో రిటైర్డ్ సీనియర్ డ్రైవర్స్ తో కమిటీ వేసి, వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా, రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాలతో రామారావును విధుల నుండి సస్పెండ్ చేయటం జరిగిందని పేర్కొన్నారు. కమిటి నుండి వైదొలగినవారు తమ సంఘం లోగో లెటర్ హెడ్ను ఎలా వాడుకుంటారని ఆయన ప్రశ్నించారు. తమ లెటర్ హెడ్లతో సంఘం పేరు ప్రతిష్టలను బదనాo చేస్తున్నారని, ఇలా బదనాo చేసిన వారిపై రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాలు మరియు సూచనలతో క్రమశిక్షణ చర్యలు మరియు న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సంసిద్ధమయ్యామని తెలిపారు.గత నెల 29వ తేదీన ఖమ్మం ప్రెనె క్లబ్లో తమ సంఘం లెటర్ హెడ్తో వారి పేర్లను ప్రింట్ చేయించుకుని తమదే అసలైన సంఘం అనేవిధంగా అక్కడి వారిని నమ్మిస్తూ, సంఘ ఔన్నత్యాన్ని మరియు మర్యాదలకు భంగం కలిగించే ప్రయత్నం చేశారని అలాంటి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేవిధంగా మా సంఘం నాయకులు మరియు సభ్యులు సంసిద్ధంగా ఉన్నామన్నారు.గత నెల 29వ తేదీన ఖమ్మం ప్రెస్ క్లబ్లో లో జరిగిన సమావేశంలో సస్పెండ్ అయిన వారితో తమ సంఘంలో కొనసాగుతూ వస్తున్న వారు (1) డి.వేణుగోపాల్ (2) కె. వెంకటేశ్వర్లు (3) జి. నాగరాజు (4) జి. రాములు (5) ఎస్.వి.ప్రసాద్ (6) ఎల్. గంగన్నలు విలేకర్ల సమావేశంలో పాల్గొనటం క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించి నట్లేనని వారు సంజాయిషీ చెప్పుకుని సంఘం విధి విధానాలకు లోబడి పనిచేస్తామని అనుకూలంగా ఉంటే సంఘంలో కొనసాగుతారని. లేదంటే వారిపైన కూడా న్యాయపరమైన మరియు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఖమ్మం జిల్లా అధ్యక్షులు హకీం హెచ్చరించారు. ఈసమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి టి. పంతులు, ముఖ్య సలహాదారులు నయీం, యం. బాబురావు, గౌరీరాజు రాములు, జి. విద్యాసాగర్, జిల్లా కోశాధికారి సయ్యద్ యాకూబ్, ఉపాధ్యక్షులు రఫి, ఎస్.కె. జానిమియా, అబ్దుల్ పాషా, టౌన్ అధ్యక్షులు పేరుబత్తిని అబ్బు రాములు, ఖమ్మం టౌన్ కోశాధికారి జాని తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు