రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనం.

విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్టను భంగపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీ దేశద్రోహి అంటూ నినాదాలు.

….. కొలుకూరి రాజశేఖర్ రెడ్డి,
….. అనంతరావు కులకర్ణి,

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లు

సంగారెడ్డి సెప్టెంబర్ 12 ప్రజ బలం ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి సూచన మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ డౌన్ డౌన్ నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొలుకూరి రాజశేఖర్ రెడ్డి మరియు జిల్లా ఉపాధ్యక్షులు పోచారం రాములు ఇరువురు మాట్లాడుతూ గత 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో దేశంలో మతకుల రాజకీయాలు చేస్తూ దేశం అభివృద్ధి నోచుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత 60 సంవత్సరాలు పాలించి దేశాన్ని సర్వనాశనం చేశారని, ఈరోజు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆర్థిక వ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం శోచనీయమని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని దేశం అభివృద్ధి చెందుతుందన్నారు విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్టను భంగపరిచే విధంగా మాట్లాడిన రాహుల్ గాంధీని దేశ ప్రజలు ఒక దేశద్రోహిగా పరగనిస్తానన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, జిల్లా ఉపాధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్లు మందుల నాగరాజు, కసిని వాసు, ద్వారకా రవి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, శివంగుల నాగరాజ్, శ్రీనివాస్, అనిత గోవింద బాబా, చారి, సదానంద చారి, శ్రీపతిరావు, మీనా గౌడ్, తేజస్విని, లక్ష్మి రాజు, సాయి రెడ్డి, ప్రభాస్, గాజుల అనిల్, అజయ్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking