మెదక్​ జిల్లా ట్రాన్స్​కో ఎస్​ఈగా శంకర్​

 

ప్రజాబలం -మెదక్ జిల్లా నియోజకవర్గం
12.09.2024:

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ (ట్రాన్స్​కో) సూపరింటెండెంట్​ ఇంజనీర్​ (ఎస్​ఈ)గా శంకర్​ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్​లో ఎస్​ఈగా విధులు నిర్వహించిన జానకీరాములు ఉద్యోగ విరమణ చేయగా ఆయన స్థానంలో శంకర్​ను బదిలీ చేయగా ఎస్​ఈగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్​ఈ శంకర్​ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం యూనియన్ నాయకులు ఓరం సత్యనారాయణ, ఉప్పర నర్సింగ్, అశోక్, రమేష్, రాజేశ్వర్, నాగరాజు, శేఖర్, శ్రీకాంత్, చంద్రమౌళి, కనకయ్య , రత్నం, రాములు , బాలకృష్ణ తదితరులు కలిసి పూలమాలతో సన్మానించారు. అనంతరం ఎస్​ఈ శంకర్​ మాట్లాడుతూ… మెదక్​ జిల్లాలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని… ప్రజలకు, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని… ఎవరైనా తమ సమస్యలు ఉంటే తనకు నేరుగా తెలియజేవచ్చని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking