జూబ్లీహీల్స్ ప్రజాబలం ప్రతినిధి:బుధవారం నాడు కౌశిక్ రెడ్డి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వాక్యాలను ఖండిస్తూ,గురువారంనాడు కౌశిక్ రెడ్డి మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని , బిఆర్‌ఎస్ భవన్ ను ముట్టడిరచడం జరిగింది. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే, చీరలను గాజులను దరిస్తారు. అలాంటిది చీరను, గాజులను మీడియా ముందు చూపిస్తూ మగవాళ్ళని ధరించమని మాట్లాడాడు. గాజులు వేసుకొని చీర కట్టుకున్న మహిళలంటే ఎందుకు అంత చిన్న చూపు , అదే మహిళలు ఓటు వేసి నిన్ను హుజురాబాద్ లో గెలిపించారన్న సంగతి మరిచిపోయి అదేవిధంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళలను కించపరిచే విధంగా మహిళలను ఆర్టీసీ బస్సులో డిస్కోడ్యాన్సులు చేయిమని అన్నారు.బీఆర్‌ఎస్ పార్టీకి మహిళలను చిన్నచూపు చూస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతో సిగ్గుచేటు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ,వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి అని డౌన్ డౌన్ కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.