హైదరాబాద్‌ హోంగార్డ్స్‌ కమాండెంట్‌ కు విజ్ఞప్తి చేసిన హోంగార్డ్‌ సంఘం నాయకులు

డాక్టర్‌ కొత్వల్‌ దయానంద్‌
తెలంగాణ హోంగార్డ్స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
ఛార్మీనార్‌ ప్రజాబలం ప్రతినిధి:గురువారంనాడు హైదరాబాద్‌ సిటీ కమాండెంట్‌ కెవి కిషన్‌ రావు ని ఎసీపీ భాస్కర్‌ ని ఆర్‌ఐ అడ్మిన్‌ సుమన్‌ ్‌ మర్యాదపూర్వకంగా కలిసి హోంగార్డ్స్‌ సమస్యల విషయంలో అలాగే నేటి వరకు రాని జీతం విషయంలో మాట్లాడడం జరిగింది. కమాండెంట్‌ సానుకూలంగా స్పందించి గురువారంనాడు సాయంత్రం నుండి రేపటి వరకు అన్ని జిల్లాల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి హోంగార్డ్స్‌ జీతాలు రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది.
అలాగే హోంగార్డ్స్‌ కు పర్మెంట్‌ సంబంధించిన మరియు ప్రధాన సమస్యల విషయంలో సుదీర్ఘమైన సంభాషణలో కమడెంట్‌ స్ఫూర్తివంతమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డా॥ కొత్వల్‌ దయానంద్‌ అలాగే హోంగార్డ్స్‌ సహచర మిత్రులు లక్ష్మీనారాయణ’’ వైపీ స్వామి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking