రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 28 జనవరి 2024: కుక్కలకు పార్వోవైరస్ అనేది ఒక అంటువ్యాది వైరస్ అని ఇది ప్రధానంగా కుక్కలను ప్రభావితం చేస్తు కుక్కల మలంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంపర్కం ద్వారా కుక్క నుండి కుక్కకు వ్యాపిస్తుందని, వాటి భారిన పడ్డ వారు సమయానికి చికిత్స అందని సందర్భాల్లో 91% మరణాలకి దారి తీస్తుందని, వ్యాధి నిరోధక టీకాలు ఈ సంక్రమణను నిరోధించగలవని, శ్రీమతి అక్కినేని అమల నాగార్జున నిర్వహిస్తున్న బ్లూ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మణికోండలో గల దాదాపు 200 మంది సభ్యుల సహకారంతో గత రెండు సంవత్సరములుగా కుక్కలకు సంక్రమణను నిరోధించగల వ్యాధి నిరోధక టీకాలు వేయిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా దాదాపు 700ల వరకూ కుక్కలకు టీకాలు వేయించడం జరిగినదని, ఈ సందర్భంగా అలకాపురి రోడ్ నెంబర్ 1 లో గల కాళోజీ నారాయణరావు పార్క్ లో చిన్నపాటి సభ నిర్వచించడం జరిగినదని అందులో రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు ప్రకాశ్ గౌడ్, శ్రీమతి అక్కినేని అమల నాగార్జున, మున్సిపల్ కమిషనర్ ఫాల్గుణ కుమార్, స్ధానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొని సభను జయప్రదం గావించడం జరిగినది.