ఖమ్మంలో చిగురుపాటి ఇండో యూఎస్ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మల్లు నందిని

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 28(ప్రజాబలం) ఖమ్మం నగరంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదురుగా చిగురుపాటి ఇండో యూఎస్ చెవి ముక్కు గొంతు డెంటల్ హాస్పిటల్ ను ఓపెనింగ్ చేయటకు విచ్చేసిన వారికి హాస్పటల్ ఎండి చిగురుపాటి నాగేశ్వరావు స్వాగతం పలికారు అనంతరం రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని ప్రారంభించారు అనంతరం గ్రామీణ వైద్యులు కీర్తిశేషులు బ్రహ్మం కుమారులు చెవి ముక్కు గొంతు డాక్టర్ ఉమామహేశ్వర రావు డెంటల్ డాక్టర్ ఉదయ్ కిరణ్ లను మంత్రి తుమ్మల మల్లు నందిని అభినందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మంలో ఇటువంటి హాస్పిటల్ రావడం సంతోషదాయకం అన్నారు ఇద్దరు అన్నదమ్ముల హాస్పటల్ అభివృద్ధి చెందాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య డిసిసిబి డైరెక్టర్ యలిగొండ స్వామి కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు నాయకులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking