సొంత ఊరికి వివిసి ట్రస్ట్ భారీ విరాళం

 

-జన్మభూమి రుణం తీర్చుకుంటున్న వివిసి ట్రస్ట్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 27 (ప్రజాబలం)
వివిసి ట్రస్ట్ చైర్మన్ వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పుట్టిన ఊరికి తమ వివిసి ట్రస్ట్ ద్వారా నాగులవంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విధ్యార్దులకు మధ్యాహ్న బోజనశాలను కట్టించారు.డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క చేతులమీదుగా ప్రారంభించారు.నాగులవాంచ గ్రామ ప్రజలకు 4 లక్షలతో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు.ముందు ముందు వివిసి ట్రస్ట్ నాగులవంచ ప్రజలకు ఏన్నో సౌకర్యాలు కలిస్తు అండగా ఉంటుందని చైర్మన్ రాజేంద్రప్రసాద్ తెలిపారునాగులవంచలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డిజిటల్ లైబ్రరీ ఆర్వో ప్లాంట్ స్పోర్ట్స్ కిట్ అందిస్తానని హామి ఇచ్చారు.కళశాలలో ఇంటర్ మంచి మార్కులు ర్యాంక్ లు సాదించిన వారికి గోల్డ్ మోడల్ ఇస్తామని తెలిపారు నాగులవంచ గ్రామ ప్రజలు వివిసి రాజా ను ఘనంగా సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు. డిప్యూటి సిఎం భట్టి వాక్రమార్క మాట్లాడుతూ వివిసి రాజేంద్రప్రసాద్ తను పుట్టిన జన్మభూమికి ఇంత అభివృద్ది చేయటం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతు ట్రస్ట్ ద్వారా ఏన్నో కార్యక్రమాలు చేస్తామని అన్నారుమా తాతా పేరు మీద వంకాయలపాటీ రామయ్య పేరు మీద ఉచిత కళ్యాణ మండపం నిర్మించామని తెలిపారు.పాఠశాలలో విద్యార్దుల కోసం వంకాయలపాటీ రామయ్య పేరు మీద 10 లక్షల వ్యయింతో బోజన శాల నిర్మించామని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking