మణికొండలో ఆకతాయిల భరతం పట్టండి

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 5 ఏప్రిల్ 2025
గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట బి.ఆర్.ఎస్ పార్టీ స్థానిక నాయకులు శనివారం రోజున లాలమ్మ గార్డెన్స్ పరిసర ప్రాంతాలలో ప్రజాబిప్రాయ సేకరణలో భాగంగా సందర్శించడం జరిగిందని భారత రాష్ర్ట సమితి మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలుపుతూ ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వారి అభిప్రాయాలలో ఆకతాయి పిల్లలు సాయంత్రం కాగానే లో ఇరుకుగా ఉన్న వీధి నంబర్ 3 మొదట్లో కారు పార్కింగ్ చేస్తున్నారని తత్ద్వార అత్యవసర పరిస్థితిలో రాక పోకలకు ఇబ్బంది పడుతున్నారనీ, ఈ విషయమై పోలీసులకు తెలిపిననను ప్రయోజనం శూన్యమని తదుపరి ఇరుకుగా ఉన్న వీధి లోపల ఎక్కడ బడితే అక్కడ కారులు పార్కింగ్ చేస్తున్నారని తత్ద్వార కూడా వీధి గుండా బయటకు వెళ్లడానికి చాలా అవస్త పడవలసి వస్తున్నట్లు స్తానిక నివాసులు తెలియ పరచారు. హైదరాబాద్ నగరంలోని ఆస్తి పన్ను వసూలు కంటే మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఇండ్లకు ప్రస్తుతము పెంచిన ఆస్తి పన్ను చాలా రేట్లు ఎక్కువగా ఉన్నదని విస్తుపోతున్నారు. శునకాల బెడద తీవ్రంగా ఎదుర్కుంటున్నామని వాపోయారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగలేదని, అందుకు కారణంగా తరచూ డ్రైనేజీ సమస్య తలెత్తు తున్నదనీ, దానికి తోడు వారానికి ఒక పర్యాయం వీధులను ఉడుస్తున్నారని తెలియ చేసినారు. మంచి నీటి ఎద్దడి కూడా తీవ్రంగా ఉన్నదనీ, జలమండలి వారి ట్యాంకర్స్ సదుపాయం కూడా సరిగ్గా లేదని, ప్రైవేట్ ట్యాంకర్ల వారు ఈ కారణంగా అధిక ధర వసూలు చేస్తున్నారనీ ఆర్ధిక భారం పడుతున్నదని విలవిల లాడుచున్నారని తెలుపుతూ కావున సంబంధిత అధికారులు సమస్యలను పరిష్కరించాలని కోరడమైనదనీ బీ.ఆర్.ఎస్ నాయకులు అందే లక్ష్మణ్ రావు, బుద్ధోలు బాబు, గోరుకంటి విఠల్, యాలాల కిరణ్, బండమీది మల్లేష్, శ్రీనివాస్ చారి, రాజేంద్ర ప్రసాద్, సుమనళిని, రమణ మూర్తి, బాలాజీ, రాజు, రామసుబ్బా రెడ్డి తది తరులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking