వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి ( ప్రజాబలం ఏప్రిల్ 5 ) వికారాబాద్ జిల్లామర్పల్లి మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఉన్న బిజేఆర్ స్థలం దగ్గర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.అంబేద్కర్ తర్వాత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వచ్చిన గొప్ప నాయకుడు జగజీవన్ రామ్ అని, భారతదేశానికి అనేక సేవలు ఆయన చేశాడని గుర్తు చేసుకున్నారు. విగ్రహ ఏర్పాటు కోసము తన వంతు సహాయంగా మధుగు రామేశ్వర్ లక్ష 116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి జె ఆర్ యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్మల సురేష్, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్, కలిముద్దీన్, సలీం, మన్నె సురేష్, వసంత్ కుమార్,ధరమ్ సింగ్, యూత్ అధ్యక్షుడు కోటగారి జగదీష్, మాజీ సర్పంచ్ పండు నాయక్, జిల్లా జనరల్ సెక్రెటరీ సంజీవరెడ్డి, బీసీ నాయకుడు ఈశ్వర్, శేఖర్ యాదవ్, నర్సింలు యాదవ్, రతన్, పరవేద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు