స్వాతంత్ర సమరయోధుడు మన బాబు జగ్జీవన్ రామ్

 

ఘన నివాళులు అర్పించిన వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్5(ప్రజాబలం)వికారాబాద్ జిల్లా/ వికారాబాద్ పట్టణంలో స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని బి జె ఆర్ చౌరస్తాలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సూపర్డెంట్ ఆఫ్ పోలీస్,నారాయణరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, SC సంఘాల ప్రతినిధులు, అభిమనూలు స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని, కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా వారికి నా నివాళులు. చిన్నతనంలోనే అంటరానితనాన్ని, కుల వివక్షను దైర్యంగా ఎదిరించిన వ్యక్తి జగ్జీవన్ రామ్ బీహార్ లోని చిన్న గ్రామంలో పుట్టిన జగ్జీవన్ రామ్ దేశ స్థాయిలో అత్యున్నత పదవులను అలంకరించారు.

 

స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు జీవితం గడిపారు. స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో సభ్యునిగా అన్ని వర్గాలకు సమన్యాయం జరిగే విదంగా వ్యవహరించారు.భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా తదుపరి వ్యవసాయ, రక్షణ శాఖలను నిర్వహించి దేశంలో అత్యధిక కాలం కేంద్ర మంత్రిగా కొనసాగిన రికార్డు వారి సొంతం. దానితో పాటుగా 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు చట్ట సభలలో సభ్యునిగా ఉండడం వరల్డ్ రికార్డు. అన్ని వర్గాల ఆదరణ, సేవాభావంతోనే వారు అన్ని దశాబ్ధాలు రాజకీయ, ప్రజా జీవితంలో కొనసాగారు. నేటి రాజకీయ నాయకులకు బాబు జగజ్జీవన్ రామ్ ఆదర్శం.పదవులకు వన్నె తెచ్చిన నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ గారు. భారతదేశ మొదటి కార్మిక శాఖ మంత్రిగా దేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలను రూపొందించారు. తరువాత 1971 లో జరిగిన భారత్ పాక్ యుద్ద సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్న జగజ్జీవన్ రామ్ ఇందిరాగాంధీ గారి ఆదేశాలకు అనుగుణంగా విజయవంతంగా సేనలను నడిపించడంతో పాటుగా బంగ్లాదేశ్ దేశ స్థాపనలో కీలక పాత్ర వహించారు. 1974 లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవాన్ని ప్రారంభించి దేశంలో ఆహార ధాన్యల కొరతకు పరిష్కారం కల్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ సూచించిన అన్ని వర్గాలకు స న్యాయం అనే మార్గంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నది. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన అన్ని వర్గాలకు అందుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,సబ్సిడి గ్యాస్ సిలెండర్, ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం పంపిణి ఇవన్ని కూడా అన్ని వర్గాలకు సమంగా అందుతున్నాయి.అదేవిధంగా మార్చి నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బిసి లకు 42 శాతం వరకు రిజర్వేషన్లను పెంచాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఎస్సీ ల వర్గీకరణ అమలు చేసే బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించారు. తద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ రెండు నిర్ణయాల ద్వారా సమాజంలో మెజారిటీగా ఉన్న దళితులు,వెనుకబడిన తరగతుల వర్గాల వారు రాజకీయంగా విద్య, ఉద్యోగ రంగాలలో అభివృద్ధి చెందుతారు. ఈ రెండు బిల్లులు నేను సభాపతిగా ఉండగా జరగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను, సేవలను మనమందరం గుర్తు చేసుకుని వారి మార్గంలో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. అని వికారాబాద్ శాసనసభ్యులు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking