ఉద్యోగుల పెండిరగ్‌… బిల్లులకు త్వరలోనే మోక్షం..!

– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టిని కలిసి వినతిపత్రం అందించిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు
– సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం
– త్వరలోనే విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం హామీ
హైదరాబాద ప్రజాబలం ప్రతినిధి:శుక్రవారం 4 : ప్రభుత్వ ఉద్యోగుల పెండిరగ్‌
బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి. లచ్చిరెడ్డి తెలిపారు. ఉద్యోగుల పెండిరగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజా భవన్‌ లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ సీఎం కు వివరించారు. ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండిరగ్‌ బిల్లుల క్లియరెన్స్‌ తో పాటు రాష్ట్ర స్థాయిలో మా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పెండిరగ్‌ బిల్లుల క్లియరెన్స్‌ అనివార్యత ను వివరించారు.
ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌, నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన బట్టి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, త్వరలోనే పెండిరగ్‌ లో ఉన్న బిల్లులను విడుదల చేస్తామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎం ను కలిసిన వారిలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె. రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, జనరల్‌ సెక్రటరీ రమేష్‌ పాక తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking