గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గన్‌ఫౌండ్రీ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు మమతా సంతోష్‌గుప్తా గన్‌ఫౌండ్రీడివిజన్‌లో గత వారంరోజులుగా ప్రజల వద్దకు కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యల కొరకు పాలెస్ కాలనీ బొగ్గులకుంటా ,గౌలీగుడా ,ఇసామియా బజార్ ,నానామియా గల్లీ గద్వాల్ కాంపౌండ్ బడీచోడీ విజిటేబుల్ మార్కెట్ సూర్యాలోక్ కాంప్లెక్స్ లైన్ మెడ్విన్ హస్పిటల్ తదితర బస్తీలలో పర్యటించి వారి ఇబ్బందులను తెలుసుకుని సంబందిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యలకు కావల్సిన బడ్జెట్‌ను కేటాయించాలని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కలిసి డివిజన్ లోని సమస్యలను వివరించి వినతి పత్రం అందజేయడం జరిగినది.మేయర్ సానుకూలంగా స్పందించి డివిజన్‌కు సంబంధించిన అభివృద్ది పనులకు సహకరిస్తానని తెలిపారని మమతా సంతోష్‌గుప్తా అన్నారు.