వరద నివారణకు సమగ్ర చర్యలు తీసుకోండి: కమిషనర్‌ ఇలంబర్తి

యాకత్‌పూర ప్రజాబలం:ఏప్రిల్‌ 04: నగరంలో కురిసిన వర్షాలకు హాకీంపేట్‌ వరద ప్రవాహం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా శాశ్వత పరిష్కారం చేసేందుకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జోనల్‌ కమీషనర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్‌ ఈ రత్నాకర్‌, ఇతర అధికారులతో కలిసి వరద ముంపుకు గురైన ప్రాంతాలను కమిషనర్‌ పరిశీలించారు.

బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీ, లోటస్‌ ఫాండ్‌ నుండి వర్షపు వరద ప్రవాహం హకీం పేట్‌ నుండి బల్కం చెరువులోకి వెళుతున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు  కమిషనర్‌ కు వివరించారు. గతంలో వరద రాలేదని హెచ్‌ ఎండిఏ లే ఔట్‌ చేయడం మూలంగా వర్షం కురిసినప్పుడు వరద వస్తున్నట్లు స్థానికులు తెలిపారు. గతంలో లే ఔట్‌ చేయక ముందు చెట్లు ఉండటం మూలంగా ఎక్కువ వరద రాలేదని, ఇటీవల కురిసిన వర్షాలకు హకీంపేట్‌ కు లే అవుట్‌ మట్టితో వరద వస్తుందని తెలిపారు. వరదలో వచ్చిన మట్టిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి డి పి ఆర్‌ తయారు చేసి పంపాలని ఇంజనీరింగ్‌ అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జోనల్‌ కమీషనర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్‌.ఈ  రత్నాకర్‌, కార్వాన్‌, జూబ్లిహిల్స్‌ ఈ.ఈ లు వెంకట శేషాచలం, విజయ్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking