కూకట్పల్లి (ప్రజాబలం) ఏప్రిల్ 04 :
కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ కి చెందిన నరసింహ చారి కి 60,000/ చెక్కు, బాలనగర్ కి చెందిన సరోజ .బీరగోని కి 39,000/- చెక్కు అల్లాపూర్ కి చెందిన రైనీ.భూలక్ష్మి కి 42,500/- చెక్కు మంజూరైనవి. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,03,250/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చెక్కులను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి, తూము వేణు, పుష్ప రెడ్డి, లక్ష్మయ్య, దండగుల యాదగిరి, రాఘవేందర్, కుక్కల రమేష్, యుగేందర్ , మధు గౌడ్, మేకల రమేష్, మల్లికార్జున్ యాదవ్, మస్తాన్ రెడ్డి, అయాజ్ , ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.