-మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్
పిబ్రవరి 21
నేర నిరూపణలో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తాయని ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానమని మందమర్రి పట్టణ సీఐ శశిధర్ రెడ్డి అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా అంగడిబజార్ లో నెల రోజుల కిందట సీసీ కెమెరాల ఉపయోగం అవసరంపై అవగాహనా కలిపించగా కాలనీ వాసులు సహకారంతో 04 సిసి కెమెరాలు అంగడి బజార్ సెంటర్ లో ఏర్పాటు చేయగా శుక్రవారం కాలనీ వాసులతో కలిసి కమ్యూనిటీ సిసి కెమెరాలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ
సీసీ కెమెరాల ఏర్పాటు చేయడానికి సహకరించిన అంగడి బజార్ కాలనీ ప్రజలకి అభినందనలు తెలిపారు.
సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సిసి కెమెరాలు ఉన్న ప్రాంతాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని, సీసీ కెమెరాలు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా ఈ మధ్యకాలంలో చాలా కేసులు చేదించడం జరిగిందని తెలిపారు. కేసుల ట్రయల్ సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని కాలనీలు సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటు కు కృషి చేసిన కాలనీ వాసులను సిఐ శశిధర్ రెడ్డి, స్థానిక ఎస్సై తో కలిసి సన్మానించి, మిగిలిన కాలనీ వాసులకు ఆదర్శంగా నిలిచినందుకు అభినందించారు.
