హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 21
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజున కళాశాల ప్రిన్సిపాల్ డా.బి.రమేష్ అధ్యక్షతన, తెలుగు విభాగం అధ్యాపకురాలు డా.ఎం. శ్యామల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడుతూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని అది సమాజ పురోగతికి దోహదపడుతుందని అన్నారు. తెలుగు అధ్యాపకురాలు శ్యామల మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెపుతూ కవుల కవితలను ఉదహరించారు.ఈ కార్యక్రమంతో కళాశాల వైస్ – ప్రిన్సిపాల్ డా. ఎస్. ఓదెలు కుమార్, అకాడమిక్ కో- ఆర్డినేటర్ డా.కె.రాజేంద్ర, స్టాఫ్ సెక్రెటరీ డా.కె. గణేష్, కిరణ్ కుమార్, డా.కె. మాధవి, ఉమాకిరణ్, రాజకుమార్, రవీందక, శ్రీనివాస్ రెడ్డి, రవి ప్రకాశ్, సుష్మ, శ్రీనివాష్, సాయికువంద్, ప్రశాంత, అరుణ్ రాజ్, అధ్యాపకేతర సిచ్చింది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.