– సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఫిబ్రవరి 21 (ప్రజాబలం ప్రతినిధి)
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను ఓటు అడిగే హక్కు బిజెపి పార్టీకి లేదని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ఆర్ఎంపి భవనంలో ఆర్ఎంపి పిఎంపి అసోసియేషన్ టౌన్ అధ్యక్షుడు కుడిక్యాల రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి పార్టీ ఎన్నికల ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు,15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామన్నారు, బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది 22 కోట్లు ఉద్యోగాలు రావాలి మన తెలంగాణ వాటా 30- 40 లక్షల ఉద్యోగాలు రావాలి వచ్చినాయా నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా అమలు పరచలేదని విమర్శించారు. బీఆర్ఎస్ తమ పార్టీ ఉనికిని కోల్పోయిందని ఈ ఎమ్మెల్సీ లో పోటీకి దూరంగా ఉండి బిజెపికి మద్దతిస్తుందని ఆయన విమర్శించాడు. సిద్దిపేట నిజాంబాద్ కరీంనగర్ బీఆర్ఎస్ కు మంచి పట్టున్న ప్రాంతాలు ఆయన ఎమ్మెల్సీకి దూరంగా ఉండడానికి కారణం పార్టీ ఉనికి లేదని అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పైన విమర్శించడం సరైంది కాదని ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా ముఖ్య నాయకుల ఫోటోలు పార్టీ గుర్తులు కనబడకుండా కవర్ చేస్తారని ఆ విషయం కూడా అర్థం కాదా అని బి ఆర్ ఎస్ పార్టీని దుయ్యబట్టారు, నిన్న జరిగిన కరీంనగర్ డైరీ మూసివేత పైన ఆయన స్పందిస్తూ దానికి ఎలాంటి లైసెన్సులు లేవని ఫైర్ సేఫ్టీ, అనేక లైసెన్స్ లేవని అందుకే మూసి వేయడం జరిగిందని, పాడి రైతులకు ఇబ్బంది కలగకుండా కొన్ని రోజులు వ్యవధి ఇస్తూ తిరిగి తెరిపించామని అన్నారు కలెక్టర్ తన ఉద్యోగాన్ని సరైన విధంగా పనిచేస్తున్నాడని పాల కేంద్రంలో ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరు బాధ్యులు వహిస్తారని ఇన్ని రోజులు ఏ లైసెన్సు లేకుండా నడిచింది అని అన్నారు. బడ్జెట్లో సగం డబ్బులు వడ్డీలే కడుతున్నామని ఆయన అన్నారు మిగిలిన డబ్బులతో మేము ఇచ్చిన హామీలు ,పథకాలు నెరవేరుస్తున్నామని ఆయన చెప్పారు. గత ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒక సిరిసిల్ల పట్టణం తప్ప మిగిలిన అన్ని గ్రామాలలో అధిక ఓట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు . అయినా కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటదని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతి రెడ్డి ,నళినికాంత్ , గౌతమ్ , శ్రీనివాస్ ఆర్ఎంపీ పిఎంపీ జిల్లా అధ్యక్షుడు దాసి రాజమల్లు ఆర్ఎంపి సోదరులు తదితరులు పాల్గొన్నారు.