మాదవ్ నాయక్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

 

-రాబర్ట్ వాద్రాపై అవినీతి ఆరోపణలు అర్థరహితం

-ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్
కాంపెల్లి సమ్మయ్య

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 21:

మాధవ్ నాయక్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఐఎన్టిఈసి సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మయ్య అన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశమైన మాట్లాడుతూ ఫిబ్రవరి 12 న జరిగిన ఏ.బి.కె.ఎం.ఎస్. సమావేశంలో చివరి రోజున, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి సమక్షంలో సిఎంపీఫ్ నిధులలో రూ. 1390.25 కోట్లు దివాస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పెట్టుబడి పెట్టగా 663.58 కోట్లు తిరిగి రాగా రూ . 727.27 నష్టాల పేరుతో తిరిగి చెల్లించకపోవడం దానిలో జరిగిన అవకతవకల గురించి ప్రస్తావిస్తూ బీఎంఎస్ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పై చేసిన అసత్య ఆరోపణలను చేసిన విషయం అన్ని ప్రతికలలో ప్రచురించ బడిందని ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలని మాధవ నాయక్ కి సూచించారు.
2019 సంవత్సరంలో ఈ విషయం వెలుగులోకి రాగా అప్పటి నుండి ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ఇప్పటివరకు సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయలేదో కార్మిక లోకానికి తెలియ చేయాలని డిమాండ్ చేశారు.
ఇక పొతే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం 35 వేల కోట్లు బకాయిలు ఉందని అన్నారని అది కూడా కేసీఆర్ ప్రభుత్వం చేసిందని కొత్తగా ఏర్పడిన కాంగ్రస్ ప్రభుత్వం చేయలేదని తెల్సుకోవాలన్నారు.
సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల గురించి మాట్లాడిన మాధవ నాయక్ రాష్ట్ర ప్రభుత్వం జనక్ ప్రసాద్ ను తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ నియమించిన వెంటనే రాష్ట్రంలో ఉన్న ఒకోటి 25 లక్షల మంది కి సంబందించిన 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల వేతనాల పెంపు కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు. దానికి సంబంధించిన పని దాదాపు పూర్తి చేశారని రాబోయే అతికొద్ది కాలంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 25 లక్షల మంది వేతనాలు ఆశాజనకంగా పెరుగనున్నట్టు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సింగరేణిలో లాభాల వాటా నుంచి 5000 రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకు, జనక్ ప్రసాద్ కు దక్కుతుందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక సింగరేణి కార్మికుల కోసం అనేక హామీలు నెరవేర్చామని ముఖ్యంగా కోటి రూపాయల ప్రమాద బీమా, నూతన బొగ్గు గనుల ప్రారంభం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ల ఏర్పాటు, నూతన నియామకాలు , పెండింగ్ లో ఉన్న వయోపరిమితి పెంపు , నూతన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బీసీ లైసెనింగ్ ఆఫీసర్ నియామకం, కాంట్రాక్ట్ కార్మికుల నలభై లక్షల ప్రమాద బీమా, వంటి అనేక హామీలు నేరవేర్చామని అన్నారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐఎన్టీయూ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో కార్మికుల సొంత ఇంటి కల, పెర్క్స్ పైన ఐటీ మాఫీ వంటి హామీలు నెరవేరుస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking