హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 21
వీణవంక మండలం కోర్కల్ గ్రామనికి చెందిన ఎండి. రిజ్వానా వివాహం ఈనెల 23వ తేదీ ఆదివారం రోజు ఉండగా ఈ వివాహానికి గ్రామంలోని కొంతమంది దాతల సహకారంతో వివాహం చేయనున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు కొమ్మిడి రాకేష్ రెడ్డి కి తెలుపగా తన యువ సైన్యం యువతి కుటుంబానికి 75 కిలోల బియ్యాన్ని అందజేశారు. రిజ్వాన తండ్రి ఇబ్రహీం గత ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు.పేదరికంలో కుటుంబం జీవనం సాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు పోతరవేన సతీష్ కుమార్, మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, మర్రి కుమార్, పల్లెర్ల కిరణ్, మద్దుల ప్రశాంత్,విద్యాసాగర్, చిలివేరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.