కతోలిక క్రైస్తవ ఎస్సి , బిసి కమిషన్ పిలుపు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు08 (ప్రజాబలం) దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కులాల (ఎస్సీ) హోదా కల్పించాలని , భారత రాజ్యాంగము అన్ని మతాలకు సమాన అవకాశాలు కల్పించినది . సిక్కు , జైన , బౌద్ధ మతములు తీసుకున్న దళితులకు షెడ్యూల్ కులాల హోదా కల్పించారు . 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు పేరా మూడు ప్రకారం దళితులు క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ హో దా కల్పించలేదు . ఈ వివక్షతను నిరసిస్తూ ఆగస్టు 10 శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ ఆఫీసు ధర్నా చౌక్ నందు కతోలిక ఎస్సీ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రార్థన మరియు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు . ఆ తర్వాత కలెక్టర్ కు మెమోరాoడం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు . కావున ఈ కార్యక్రమంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొనవలసినదిగా ఎస్సీ , బీసీ, లేటి కమిషన్ల కతోలికా ఉమ్మడి ఖమ్మం ఎస్సీ బీసీ కమిషన్ బిషప్ హౌస్ నాయుడుపేట డైరెక్టర్ పి.శభాష్టియన్ కోరారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం పీట కతోలిక బిషప్ శ్రీశ్రీ సగిలి ప్రకాష్ పాల్గొంటున్నారు . వీరితోపాటు చర్చి ఫాదర్ లు , సిస్టర్లు , క్రైస్తవులు , ఉపదేశలు , సంఘ పెద్దలు తదితరులు పాల్గొంటున్నారు కావున జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు