క్షేత్రస్థాయిలో పని చేసే పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 08 : రామగుండము పోలీస్ కమీషనరేట్ లో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం పోలీస్ సిబ్బంది కొరకు వచ్చిన రెయిన్ కొట్స్ ను ఆర్ముడ్ సిబ్బందికి గురువారం రోజున సిపి పోలీస్ కార్యాలయంలో వర్షాకాల సమయంలో విధినిర్వహణలో భాగంగా వెసుకోవడానికి రెయిన్ కోట్స్ అందజేసిన రామగుండము పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ…క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు.నిరంతరం ఎండనకా,వాననకా రాత్రింబవళ్ళు కష్టపడి పని చేసే సిబ్బందికి అత్యవసర సమయాలలో రెయిన్ కోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.విధి నిర్వహణ సమయంలో అప్రమత్తంగా ఉంటు విధులు నిర్వహించాలని, ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్,రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, కన్నమధు,మల్లేషం, శ్రీనివాస్ పాల్గొన్నారు.