ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 8 (ప్రజాబలం) ఖమ్మం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రావణమాసం మొదటి గురువారం నాడు ముత్యాలమ్మ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు . శ్రీ గణేష్ బోనాలనిలయం వద్ద గల శ్రీ వినాయక మందిరం దగ్గర నుండి విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం వారు 108 కళాశాలతో బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో మేళ తాళాలతో నృత్యాలు చేసుకుంటూ గవర్నమెంట్ హాస్పటల్ , జమ్మిబండ , పాకబండ బజార్ మీదుగా ముత్యాలమ్మ గుడికి చేరుకుని బోనాలు మరియు కళాశాలతో పాటు అమ్మవారికి శారీ , జాకెట్ ముక్క , గాజులు , పూలు సమర్పించారు . ఈ శోభాయాత్రలో దాదాపుగా 500 మంది మహిళలు పాల్గొని విజయవంతం చేశారు . దేశంలో హిందూ ధర్మం కోసం హిందూ ఐక్యత కోసం విశ్వహిందూ పరిషత్ పలు విధాలుగా దైవ కార్యక్రమాలు భజనలు , పూజలు చేస్తూ , బోనాల జాతర ద్వారా ధర్మం కోసం చేసే కార్యక్రమం లో ఖమ్మం జిల్లాలో మొట్టమొదట గురువారం ఈ బోనాల జాతరను చేయడం ఆనందకరం ఉందన్నారు . ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ , కార్యదర్శి బొడ్డు కృష్ణ , విభాగ కార్యదర్శి బాలాజీ , కోశాధికారి పసుమర్తి రవి , నగర అధ్యక్షుడు టీవీ రాజు , నగర కార్యదర్శి శ్రీనివాస్ , చాలమల వెంకటేశ్వర్లు , సహ కార్య దర్శి వేంపటి శ్యాం ప్రసాద్ , కూచిపూడి లక్మి నారాయణ , మాతృశక్తి అధ్యక్షురాలు కనగంటి నాగమణి , విశ్వహిందూ పరిషత్ మహిళా కార్య కర్తలు కొల్లా అరుణ , కూచిపూడి భానుమతి , నాగండ్ల నాగమణి , రుద్ర పద్మావతి , సరస్వతి , అనుష , సోనీ , విజయ , నున్న కృష్ణప్రియ , భవాని చౌదరి , వసంత లక్ష్మి , కల్పన , జానకి, ఉమా, ఆమని, విజయ లక్ష్మి , సునీత , అనిత తదితరులు పాల్గొన్నారు