ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి పిబ్రవరి3
వరంగల్ నగరంలోని శంభునిపేట అభ్యాస స్కూల్ పదవ వార్షికోత్సవం స్థానిక జీఎం గార్డెన్లో శనివారం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం పురాకరించుకొని విద్యార్థులు చేసిన పలు శాస్త్రీయ, జానపద, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అదేవిధంగా దేశ స్వతంత్ర నాయకుల వేషధారణలో చిన్నారులు అలరించరూ.సామాజిక సేవ, మానవత్వం, మూగజీవాలు, ప్రకృతి పై చేసిన నాటికలు దీక్షకులను ఆలోచింపజేశాయి. ఉత్సాహంగా ఈ వార్షికోత్సవం జరుపుకోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యావరణ దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి తన సందేశాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మీర్జా నజీర్ బేగ్, కరస్పాండెంట్ మీర్జా అఖిల్ ఉల్లా బేగ్ స్కూల్ ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.